Politics

నేడు తిరుపతికి నారా భువనేశ్వరి

నేడు తిరుపతికి నారా భువనేశ్వరి

టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. నిజం గెలవాలి పేరుతో ఆమె ఓ యాత్రను చేపట్టబోతున్నారు. అందులో భాగంగా ఆమె ఇవాళ ఆమె తిరుపతి వెళ్లనున్నారు. తన యాత్రకు సంబంధించి షెడ్యూల్, ప్లాన్, ఏర్పాట్లు చేసుకుంటారు. అలాగే జగనాసుర దహనం కార్యక్రమంలో పాల్గొంటారు. ప్లాన్ లో భాగంగా ఆమె 24న తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత నారావారిపల్లికి వెళ్తారు. అత్తమామలైన ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మల సమాధులకు నివాళులు అర్పిస్తారు. గ్రామ దేవత దొడ్డి గంగమ్మ, కులదైవం నాగాలమ్మకు పూజలు చేస్తారు.ఆ రాత్రికి ఆ గ్రామంలోనే ఉంటారు. 25న చంద్రగిరి శివార్లలోని అగరాలలో జరిగే తొలి బహిరంగసభలో భువనేశ్వరి పాల్గొంటారు. ఆమె చేయబోయే ప్రసంగంపై టీడీపీ శ్రేణుల్లో ఆసక్తి ఉంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టైనప్పటి నుంచి ఏపీ రాజకీయాలు హాట్‌గానే ఉన్నాయి. అలా ఉంచడంలో టీడీపీ సక్సెస్ అయ్యింది. ఆ పార్టీ రోజూ ఏదో ఒక కార్యక్రమాన్ని తలపెట్టి, నిరసన తెలుపుతోంది. అంతెందుకు ఇవాళ “దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం – మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం” అనే కార్యక్రమాన్ని ఇవాళ టీడీపీ చేపడుతోంది. “అక్టోబ‌ర్ 23 విజ‌య‌ద‌శ‌మి పండుగ సంద‌ర్భంగా రాత్రి 7 గంట‌ల నుంచి 7.05 నిమిషాల మధ్య వీధుల్లోకి వ‌చ్చి “సైకో పోవాలి” అని రాసి ఉన్న ప‌త్రాల‌ను ద‌హ‌నం చేయండి” అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ప్రజలను కోరారు. దహనానికి సంబంధించిన వీడియో, ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z