NRI-NRT

తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

Telangana Jagruthi Qatar’s Maha Bathukamma Celebrated with Grand Chandrayan -3 Abdul Aditya L1 Commemoration! తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ఘనంగా మహా బతుకమ్మ సంబరాలు. ఆకట్టుకున్న చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్ 1, నమూనాలు. తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు సుధ శ్రీ రామోజు గారు తెలిపిన వివరాల ప్రకారం దోహా, ఖతర్ ఇండియన్ కల్చరల్ సెంటర్ లో భారీ జన సందోహం నడుమ తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ అడ్వైసరి కౌన్సిల్ చైర్ పర్సన్ నందిని అబ్బగౌని ఆధ్వర్యంలో భారీ జన సందోహం నడుమ తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిధులుగా ఖతర్ భారత రాయబార కార్యాలయం ప్రథమ కార్యదర్శి శ్రీ సచిన్ దినకర్ శంక్పాల్ గారు హాజరు కాగా, ఐసీసీ అధ్యక్షుడు AP మణికంఠన్, ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ అధ్యక్షుడు EP అబ్దుల్ రెహ్మాన్, icbf ఉపాధ్యక్షులు దీపక్ శెట్టి ,ఐసీసీ ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం హెబ్బగెలు, ప్రధాన కార్యదర్శి మోహన్ కుమార్, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ మలి రెడ్డి, సజీవ్ సత్యశీలన్, సుమ మహేశ్ గౌడ, సీనియర్ కమ్యూనిటీ లీడర్ శివరాం ప్రసాద్ కోడూరు గారు, వివిధ సంఘాల ప్రెసిడెంట్లు అతిథులు గా హాజరయ్యారని తెలిపారు.

ఈ సందర్భంగా జాగృతి ఖతర్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ లక్ష్మి గంట మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో వినూత్నంగా బతుకమ్మ నిర్వహిస్తూ వస్తున్న తెలంగాణ జాగృతి ఖతర్, ఈసారి నాలుగేళ్ల అవిశ్రాంత కృషి తో మానవ మేధస్సు కు మచ్చు తునక లాంటి చంద్రయాన్ ప్రయోగంతో భారత కీర్తి పతాకాన్ని ప్రపంచం నివ్వెర పోయేల విజయ వంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తల కృషి కి కృతజ్ఞతా పూర్వకంగా చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్ 1, నమూనాల లతో ప్రదర్శించిన మహా బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది అని అన్నారు. సాంస్కృతిక కార్య క్రమాల్లో భాగంగా ఆడపడుచులు, చిన్నారులు చేసిన నృత్యాలు జనాన్ని ఉర్రూతలోగించాయి. అన్ని వర్గాల మద్దతుతో పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో విదేశి గడ్డపై ఆడపడుచులు సాంప్రదాయ బతుకమ్మ ఆట పాటలతో లయ బద్ధంగా ఆడుతూ కనుల విందు చేశారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి సత్తు పిండి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z