* హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత
ఎన్నికల వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ పట్టుబడ్డాయి. మంగళవారం నగర శివారులోని కుషాయిగూడలో ఎస్వోటీ పోలీసులు 100 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన ముఠా హైదరాబాద్ అడ్డాగా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని ముగ్గురు సభ్యులను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. కాగా, గతంలోనూ హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా చేస్తూ ఈ ముఠా అరెస్ట్ అయ్యింది. తాజాగా మరోసారి నగరంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* మద్యం మత్తులో నాటు బాంబు కొరికిన మందుబాబు
మద్యం మత్తులో కొందరు ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియదు.. ఒళ్లు తెలియకుండా పీకలదాకా తాగి.. వేరే లోకంలో విహరిస్తూ వుంటారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో బాంబు కొరికి ప్రాణాలు పొగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం గడ్డంవారిపల్లెకు చెందిన చిరంజీవి అనే వ్యక్తికి భార్యతో గొడవలు వున్నాయి.ఈ క్రమంలో ఆమె అతనితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పీకలదాకా మద్యం తాగి నాటు బాంబును నోటితో కొరికాడు. అది పేలడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
* తాండూరులో తృటిలో తప్పిన ప్రమాదం
వికారాబాద్ జిల్లా తాండూరులో తృటిలో ప్రమాదం తప్పింది. ప్లైఓవర్‌పై కారు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఇంజన్లో షాక్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దమైంది.
* లారీ డ్రైవర్‌తో భార్య వివాహేతర సంబంధం
వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు భర్త మందలించగా భార్య తన ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి భర్తను హతమార్చిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ భీంరెడ్డి వివరాలు వెల్లడించారు. వనపర్తి జిల్లాకు చెందిన చిన్నపాగ రాములు (35), కేశమ్మ (మహేశ్వరి) బతుకుదెరువు కోసం మీర్‌పేట అల్మాస్‌గూడకు వచ్చి అద్దె ఇంట్లో నివాసముంటున్నారు.రాములు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మహేశ్వరి బంధువు అయిన లారీ డ్రైవర్‌గా పనిచేసే జిల్లెలగూడలో నివసించే మంచాల రాముతో చనువుగా ఉంటోంది. ఇది గమనించిన భర్త పలుమార్లు మందలించగా విషయాన్ని ప్రియుడు రాముకు తెలిపింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని, ఎలాగైనా అంతమొందించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం మహేశ్వరి నాలుగు రోజుల క్రితం పిల్లలతో కలిసి సొంత గ్రామానికి వెళ్లిపోగా, రాము తెల్లపోగు దూలయ్యతో కలిసి ఈ నెల 20న అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న రాములుపై గొడ్డలితో దాడి చేశారు.గొంతు, తలపై తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు. ఆదివారం ఉదయం గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాము, దూలయ్య, మహేశ్వరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు.
* తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం
తమిళనాడులోని తిరువన్నమలైలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అందన్‌పూర్ బైపాస్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. టాటా సుమో – బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. టాటా సుమో తిరువన్నమలై నుంచి బెంగళూరు వెళ్తుండగా సేంగం వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో సుమోలో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఏడుగురు చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 10 మందికి గాయాలయ్యాయి. మొత్తం 14 మంది సెంగం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
* వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
జంగమహేశ్వరం గ్రామంలో దారుణం జరిగింది. బరితెగించిన టీడీపీ నాయకులు.. వైఎస్సార్సీపీ కార్యకర్త కునిరెడ్డి కృష్ణారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఆయనను టీడీపీ నేతలు గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి చంపారు.జంగమహేశ్వపురం వైఎస్సార్సీపీ పార్టీలో కృష్ణారెడ్డి యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. కృష్ణారెడ్డి హత్య నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హంతకుల కోసం మూడు స్పెషల్ టీంలను పోలీసులు రంగంలోకి దింపారు.
* దుర్గా పూజా వేడుకల్లో తొక్కిసలాట
దసరా నవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన దుర్గా పూజా వేడుకల్లో తొక్కిసలాట జరిగి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.గోపాల్ గంజ్ జిల్లాలోని రాజా దాల్ పూజా పండల్ వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో, తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఓ చిన్నారి భక్తుల మధ్య కిందపడిపోయింది. ఆ చిన్నారిని కాపాడేందుకు యత్నించిన మరో ఇద్దరు మహిళలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న ముగ్గురిని చికిత్స నిమిత్తం సదర్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా, దారిలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
👉 – Please join our whatsapp channel here –