DailyDose

8న విద్యాసంస్థల బంద్

8న విద్యాసంస్థల బంద్

కడప స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఊపందుకుంది. చంద్రబాబు, సీఎం జగన్ ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేశారు. కానీ ఇప్పటి వరకూ ప్లాంట్ నిర్మాణానికి ఎలాంటి అడుగులు పడలేదు. దీంతో విద్యార్థి సంఘం నేతలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. కడప స్టీల్ ప్లాంట్ తక్షణమే నిర్మించాలంటూ నవంబర్-8న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌‌కు పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు, వామపక్ష విద్యార్థి యువజన సంఘాల జిల్లా నేతలు నంద్యాల సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకోసం చేపట్టనున్న విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని విద్యార్థులకు, యువతకు పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని సూచించారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించే వరకూ తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.కాగా నంద్యాల సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ధనుంజయుడు, పిడిఎస్యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రఫీ, డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి రాంబాబు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి సురేష్, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రవి, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z