Politics

ఓటు వేసే వారికి ముఖ్య గమనిక

ఓటు వేసే వారికి ముఖ్య గమనిక

చిన్న పొరపాటుతో ఓటు వేసే అవకాశాన్ని చేజార్చుకోవద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ సూచించారు. ఓటు వేసేందుకు ఎన్నికల సిబ్బంది అందించే ఓటరు చిట్టీతో పాటు ఓటరు గుర్తింపుకార్డు వెంట తీసుకెళ్లాలని ఆయన శుక్రవారం ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆమోదించిన 12 రకాల గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. వాటిలో ఫొటో, పేరు, ఓటరు జాబితాతో సరిపోల్చి ఓటు వేసేందుకు అనుమతిస్తారన్నారు. ఓటరు జాబితాలో పేరు ఉంటే గుర్తింపు కార్డుతో ఓటు వేయొచ్చని అధికారులు అన్నారు.

వీటిలో ఏదైనా ఒకటి..
1.ఆధార్‌కార్డు, 2.మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, 3.కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డు, 4.ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు, 5.ఫించను మంజూరు పత్రం, 6.పాన్‌కార్డు, 7.డ్రైవింగ్‌ లైసెన్సు, 8.ఫొటో ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల, లిమిటెడ్‌ కంపీనల ఉద్యోగి గుర్తింపుకార్డు, 9.ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు జారీ చేసే గుర్తింపుకార్డు, 10.భారతీయ పాస్‌పోర్టు, 11.ఫొటో ఉన్న పోస్టాఫీసు, బ్యాంకు పాసు పుస్తకం, 12.దివ్యాంగుల గుర్తింపు కార్డు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z