DailyDose

ఈ రాశుల వారు చంద్రగ్రహణాన్ని చూడకూడదు

ఈ రాశుల వారు చంద్రగ్రహణాన్ని చూడకూడదు

కుమార పౌర్ణమి (పర్వదినం) పురస్కరించుకుని శనివారం రాత్రి రాహుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం ఏర్పడనుంది. పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రల సన్నిధిలో ప్రత్యేక సేవలు జరగనున్నాయి. ఈ గ్రహణం కొన్ని రాశులవారు చూడకూడదని, మరికొన్ని రాశుల వారికి శుభ ఫలితాలుంటాయని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితుడు, ఆంజనేయస్వామి ఉపాసకుడు ఎస్‌.బి. శ్రీనివాస ఆచార్యులు శుక్రవారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.

రాత్రంతా ఆలయం తెరుస్తారు
గ్రహణ కాలం ముందుగా భారత దేశంలోని అన్ని పవిత్ర (పుణ్య) క్షేత్రాల్లో దేవతారాధన, పూజలు జరగవు. ఆలయాలు తలుపులు మూసేస్తారు. దీనికి భిన్నం పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథ సన్నిధి రాత్రంతా తెరిచే ఉంటుంది. స్వామికి గోప్య (ప్రత్యేక) సేవలు జరుగుతాయి. భక్తులు ఆలయంలో పురుషోత్తమునికి మౌన ప్రార్థనలు చేస్తారు. గ్రహణం వీడిన తర్వాత ముగ్గురు మూర్తులకు మహా స్నానం, ఆలయ సంప్రోక్షణ చేస్తారు. అనంతరం మంగళహారతి, అబకాశ, మైలం, తిలకధారణ తదితర సేవలు జరుగుతాయని శ్రీక్షేత్ర సేవల విభాగం సంచాలకుడు రవీంద్ర సాహు చెప్పారు.

ఆ రాశుల వారు చూడకూడదు
మేష, కర్కాటక, సింహరాశుల వారు, అశ్వినీ నక్షత్రంలో జన్మించిన వారు గ్రహణం చూడరాదని శ్రీనివాస ఆచార్యులు తెలిపారు. కుమార పౌర్ణమి పూజలు, వ్రతాలు, నోములు నోచుకునే వారంతా శనివారం మధ్యాహ్నం 3.30 గంటల లోపుగా చేయాలి. ప్రసాదాలు (భోజనం) 4 గంటలు లోపుగా తీసుకోవాలని, తర్వాత ఆహారం భుజించరాదని చెప్పారు. మూడు రాశులు, అశ్విని నక్షత్రం వారికి మినహాయిస్తే మిగతా తొమ్మిది రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయని ఆచార్యులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z