సౌత్ ఇండస్ట్రీలో తమ అభిమాన హీరోలపై ప్రేక్షకుల అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలకు, హీరోయిన్స్ కు మనదగ్గర ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. ఇక తమ అభిమాన హీరోగా పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి. తమ అభిమాన హీరోల కోసం ఏమైనా చేస్తారు. సినీ తారల పుట్టినరోజులంటే అభిమానులకు ఓ వేడుకలా ఉంటుంది. తమ అభిమాన నటీనటుల భారీ కటౌట్‌లు.. వాటికి పాలతో అభిషేకం చేయడం…అన్నదానం నిర్వహించడం లాంటివి చేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. దేవుళ్లలా పూజిస్తారు. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ కి ఇలాంటి ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ,మన దగ్గర ఓ అభిమాని స్టార్ హీరోయిన్ సమంత విగ్రహాన్ని తయారు చేసి పూజలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సినీ అభిమాని సూపర్ స్టార్ రజనీకాంత్ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశాడు. ఖుష్బూ, అమితాబ్ బచ్చన్, నరేంద్ర మోడీ లాంటి సెలబ్రిటీలను దేవుళ్లుగా పూజించడం మనం ఇప్పటికే చూశాం. వారికి గుడి కట్టి పూజలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడుకు చెందిన ఒక యువకుడు సూపర్ స్టార్ రజనీకాంత్ విగ్రహాన్ని తయారు చేసి , తన అభిమానిని చాటి చెప్పడానికి ప్రతిరోజూ పూజలు చేస్తున్నాడు.
చాలా మంది తమ అభిమాన నటుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, సినిమా విడుదల సమయంలో గ్రాండ్ సెలబ్రేట్ చేసుకోవడం.. వాళ్ల పేర్లు టాటూ వేయించుకోవడం, ఆయనతో సెల్ఫీ దిగడం ఇలాంటి చాలానే చూశాం. తాజాగా ఇక్కడ ఒక యువ అభిమాని ఇతరుల కంటే కొంచెం భిన్నంగా ఆలోచించి తన ఫెవరెట్ నటుడి విగ్రహాన్ని తయారు చేశాడు.
మదురైకి చెందిన కార్తీక్ అనే యువకుడు తన అభిమాన నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు మీద గుడి కట్టాడు. అక్కడ 250 కేజీల రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు, దానితో పాటు అతని తల్లిదండ్రుల ఫోటో , వినాయకుడి ఫోటో ఏర్పాటు చేసి ప్రతిరోజూ దీపం వెలిగించి, రజనీ విగ్రహానికి పూజలు కూడా చేస్తున్నాడు. ఈ యువకుడు రజనీకాంత్ విగ్రహానికి పూజలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#Watch | மதுரை: திருமங்கலத்தைச் சேர்ந்த கார்த்திக் என்பவர் நடிகர் ரஜினிகாந்த்துக்கு கோயில் கட்டி, 250 கிலோ எடை கொண்ட கருங்கல்லில் அவருக்கு சிலை வைத்து நாள்தோறும் வழிபட்டு வருகிறார்.#SunNews | #Madurai | @Rajinikanth pic.twitter.com/RXut6Ot1W4
— Sun News (@sunnewstamil) October 26, 2023
👉 – Please join our whatsapp channel here –