NRI-NRT

లండన్ విమానాశ్రయంలో కవితకు స్వాగతం పలికిన ఎన్నారైలు

లండన్ విమానాశ్రయంలో కవితకు స్వాగతం పలికిన ఎన్నారైలు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, భారత్‌ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత సోమవారం లండన్‌ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో కవితకు ఎన్నారైలు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బ్రిటన్‌లోని ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో జరిగే సదస్సులో పాల్గొననున్నారు. తెలంగాణ అభివృద్ధి మోడల్‌పై భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11 గంటలకు అక్కడ కీలకోపన్యాసం చేయనున్నారు.ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు లండన్‌ వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11.30 గంటలకు ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీలో ‘ఎక్స్ ప్లోరింగ్ ఇన్ క్లూసివ్ డెవలప్మెంట్: ద తెలంగాణ మోడల్’ అనే అంశంపై ప్రసంగించనున్నారు. కీలక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గణనీయమైన పురోగతిపై ప్రజెంటేషన్ ఇస్తారు. వ్యవసాయం, విద్యుత్తు, విద్య, వైద్యం, తాగునీరు తదితర అంశాలపై తెలంగాణ సాధించిన ప్రగతిని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించనున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z