స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ పూర్తిచేసిన హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు.స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్ వేశారు.
👉 – Please join our whatsapp channel here –