Movies

ఇటలీలో వరుణ్‌ లావణ్య పెళ్లి సందడి

ఇటలీలో వరుణ్‌ లావణ్య పెళ్లి సందడి

వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠిల (Varun tej – Lavanya tripathi) పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. రేపు(నవంబర్‌ 1న) వీరి వివాహం ఇటలీలో జరగనుంది. ఈ వేడుకలో భాగంగా అక్టోబర్‌ 30న కాక్‌టేల్‌ పార్టీ జరిగింది. ఇందులో లావణ్య త్రిపాఠి వైట్ డ్రెస్‌లో మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే సోషల్‌ మీడియాలో అభిమానులు #VarunLav అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఫొటోలు షేర్‌ చేస్తున్నారు. దీంతో ఇది ట్రెండింగ్‌లో టాప్‌లోకి వచ్చింది.ఇక ఈ పార్టీలో రామ్‌ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్‌-స్నేహాలు కూడా కలర్‌ఫుల్‌గా కనిపించారు. ఇప్పటికే పెళ్లి వేడుక కోసం మెగా, అల్లు కుటుంబాలు ఇటలీ చేరుకున్నాయి. నేడు హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు. ఈ పెళ్లికి ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. హీరో నితిన్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీరజ కోన అక్కడకు చేరుకున్నారు. అలాగే ఇటలీ నుంచి వచ్చాక హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారు. నవంబర్‌ 5న మాదాపూర్‌ ఎన్‌-కన్వెన్షన్‌ వేదికగా రిసెప్షన్‌ జరగనుంది. ఇక వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇప్పుడు ఈ ప్రేమజంట పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z