Politics

జైలు నుంచి చంద్రబాబు విడుదల

జైలు నుంచి చంద్రబాబు విడుదల

తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) రాజమహేంద్రవరం జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు. తమ అధినేత విడుదల కావడంతో తెదేపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు. దీంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. నారా లోకేశ్‌, బ్రాహ్మణి, నందమూరి బాలకృష్ణ, తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు, ఏలూరి సాంబశివరావు, టి.డి.జనార్దన్‌ తదితరులు జైలు వద్దకు విచ్చేశారు. 52 రోజులుగా జైలులో ఉన్న చంద్రబాబును చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి, తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున తెదేపా శ్రేణులు తరలివచ్చారు.భారీగా తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు, అభిమానులను నిలువరించేందుకు పోలీసుల బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని తోసుకుంటూ జైలువద్దకు దూసుకొచ్చారు. దీంతో జైలు వద్ద ఉద్వేగ వాతావరణ నెలకొంది. జైలు పరిసర ప్రాంతాలు జై చంద్రబాబు.. నినాదాలతో హోరెత్తాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z