Business

ఇండియన్‌ ఆయిల్‌కు భారీ లాభం- వాణిజ్య వార్తలు

ఇండియన్‌ ఆయిల్‌కు భారీ లాభం- వాణిజ్య వార్తలు

ఇండియన్‌ ఆయిల్‌కు భారీ లాభం

ప్రభుత్వరంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC) త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. జులై- సెప్టెంబర్‌ ముగిసిన త్రైమాసికంలో భారీ లాభాలను నమోదు చేసింది. మొత్తం రూ.12,967.32 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఐఓసీ రూ.272.35 కోట్లు నష్టాన్ని ప్రకటించింది. ఐఓసీ ఇప్పటి వరకు ప్రకటించిన అత్యుత్తమ వార్షిక ఫలితాల్లో సగం కంటే ఎక్కువ లాభాన్ని ఒకే త్రైమాసికంలో ఆర్జించడం గమనార్హం. రిఫైనింగ్‌, మార్కెటింగ్‌ మార్జిన్లు పెరగడం లాభాలకు కారణమని కంపెనీ తెలిపింది. ఈ మేరకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఐఓసీ సమాచారం ఇచ్చింది. గతేడాది నుంచి దేశీయంగా చమురు ధరలు స్థిరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అప్పట్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధర భారీగా ఉండేది. దీంతో ప్రభుత్వరంగ చమురు సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌కు నష్టాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత చమురు ధరలు దిగి రావడం, దేశీయంగా ధరలు స్థిరంగా ఉండడంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు మార్జిన్లు పెరిగాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్‌- సెప్టెంబర్‌ (ఆరు నెలల్లో) మధ్య మొత్తం రూ.2,264 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిన ఐఓసీ.. ఇప్పుడు రూ.26,717.76 కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం.సమీక్ష త్రైమాసికంలో ఐఓసీ మొత్తం ఆదాయం మాత్రం రూ.2.28 లక్షల కోట్ల నుంచి రూ.2.02 లక్షల కోట్లకు తగ్గింది. ఏప్రిల్‌- సెప్టెంబర్‌ మధ్య ముడి చమురును ఆయిల్‌గా మార్చడం వల్ల ఒక్కో బ్యారెల్‌పై 13.12 డాలర్లు చొప్పున రిఫైనింగ్‌ మార్జిన్లు పొందినట్లు ఐఓసీ తెలిపింది. అయితే, త్రైమాసికంగా రిఫైనింగ్‌ మార్జిన్లు ఎంతనేది వెల్లడించలేదు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో 21.941 మిలియన్‌ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను విక్రయించగా.. 17.772 మిలియన్‌ టన్నుల క్రూడాయిల్‌ను రిఫైన్‌ చేసినట్లు ఐఓసీ తెలిపింది. ఒక్కో షేరుకు రూ.5 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ఇచ్చేందుకు ఐఓసీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.

సూపర్‌‌‌‌‌‌‌‌ లుక్స్‌‌‌‌తో ఫెరారి కొత్త కారు

ఇటాలియన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల కంపెనీ ఫెరారి  499 మోదిసికాతా స్పోర్ట్స్‌‌‌‌ ప్రోటోటైప్‌‌‌‌ను ఫెరారి వరల్డ్ ఫైనల్స్‌‌‌‌లో ప్రదర్శించింది. కంపెనీ 499 మోడల్‌‌‌‌ను బేస్ చేసుకొని ఈ బండిని డెవలప్ చేసింది. ఫెరారి499 మోదిసికాతా స్పోర్ట్స్‌‌‌‌లో ఎలక్ట్రిక్ యాక్సల్‌‌‌‌, తక్కువ స్పీడ్‌‌‌‌లోనైనా యాక్టివేట్ చేయగలిగే 4–వీల్ డ్రైవ్‌‌‌‌, ‘పుష్‌‌‌‌ టు పాస్‌‌‌‌’ ఫీచర్‌‌‌‌‌‌‌‌, అదనంగా 120 కిలోవాట్స్ పవర్‌‌‌‌‌‌‌‌ వంటి ఫీచర్లు అమర్చారు.

ఎంపీలకు యాపిల్‌ ఫోన్‌ వార్నింగ్‌

పలువురు లోక్‌సభలోని ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్‌ ఫోన్‌ వార్నింగ్‌ అలర్ట్‌ పంపిందనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఎంపీల యాపిల్‌ ఐడీ ఆధారంగా స్టేట్‌ స్పాన్సర్డ్‌ అటాకర్లు వారి ఐఫోన్‌, ఈ-మెయిల్స్‌ హ్యాక్‌ చేస్తున్నట్లు అలర్ట్‌ మెసేజ్‌లు వస్తున్నాయి. ఇప్పటికే త్రుణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎంపీ ప్రియాంక చతుర్వేదికు అలర్ట్‌లు వచ్చినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన మెసేజ్‌లను తమ ఎక్స్‌ ఖాతాద్వారా ప్రముఖులు పంచుకున్నారు. ఈ అలర్ట్‌లను ఉద్దేశించి యాపిల్‌ స్పందించింది. స్టేట్ స్పాన్సర్డ్ అటాక్ నోటిఫికేషన్‌లు కొన్నిసార్లు తప్పుడు అలారాలు కావచ్చని యాపిల్ చెప్పింది. అలా అటాక్‌ చేసేవారి వద్ద అధునాతన టెక్నాలజీ ఉంటుందని పేర్కొంది. దాంతో వారు ఎలాంటి ‌దాడికైనా పాల్పడే అవకాశం ఉందని చెప్పింది. అయితే అలా వస్తున్న అలర్ట్‌ల్లో కొన్ని తప్పుడు నోటిఫికేషన్లు ఉండవచ్చని యాపిల్‌ వివరించింది. ఈ నోటిఫికేషన్‌ల జారీకి గల కారణాలపై వ్యాఖ్యానించడానికి కంపెనీ నిరాకరించింది. ఎందుకంటే పూర్తి వివరాలు వెల్లడిస్తే భవిష్యత్తులో దాడిచేసే వారిని గుర్తించకుండా తప్పించుకోవడానికి సహాయపడినట్లు అవుతుందని కంపెనీ తెలిపింది.

వికలాంగుల కోసం ఓ పర్సనల్  వెహికల్‌‌‌

వికలాంగుల కోసం హోండా ఓ పర్సనల్ మొబిలిటీ వెహికల్‌‌‌‌ను డెవలప్ చేసింది. జపాన్‌‌‌‌ ఆటో షోలో దీనిని ప్రదర్శించింది. బాడీ వెయిట్‌‌‌‌తో ఈ బండిని నడపొచ్చు. యూజర్‌‌‌‌‌‌‌‌ను బట్టి ఎత్తును మార్చుకోవచ్చు. వ్యక్తి కూర్చునేటప్పుడు ఈ బండి ఎత్తు తక్కువగా ఉంటుంది. నడిచేటప్పుడు దీని ఎత్తు పెరుగుతుంది. ఈ బండిని యూని వన్‌‌‌‌గా పిలుస్తుండగా, ఇందులో పోస్టర్ సెన్సర్‌‌‌‌‌‌‌‌ను అమర్చారు.

 భ‌గ్గుమ‌న్న ఉల్లి ధ‌ర‌లు

ఓవైపు నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు భ‌గ్గుమంటుంటే తాజాగా ఉల్లి ధ‌ర‌లు (Onion Prices) ఆకాశానికి ఎగ‌బాక‌డంతో సామాన్యుడు త‌ల్లడిల్లే ప‌రిస్ధితి నెల‌కొంది. హైద‌రాబాద్‌, ఢిల్లీ, ముంబై వంటి మ‌హా న‌గ‌రాలు స‌హా దేశ‌వ్యాప్తంగా ఉల్లి రిటైల్ ధ‌ర‌లు స‌గ‌టున కిలో రూ. 80 ప‌ల‌క‌డంతో స‌గ‌టు జీవి ఉల్లి అంటేనే ఉలికిప‌డుతున్నాడు.ఉల్లి స‌గ‌టు ధ‌ర గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ డేటా కూడా వెల్ల‌డించింది. ఉల్లి ధ‌ర‌లు రోజురోజుకూ పెరుగుతుండ‌టం గృహిణుల‌కు కంట‌నీరు తెప్పిస్తోంది. ఉల్లి నిల్వ‌లు త‌గినంత‌గా లేక‌పోవ‌డం, స‌ర‌ఫ‌రాలు మంద‌గించ‌డంతోనే ఉల్లి ధ‌ర‌లు అమాంతం పెరుగుతున్నాయ‌ని వ్యాపారులు చెబుతున్నారు. డిసెంబ‌ర్‌లో కొత్త పంట మార్కెట్‌కు త‌ర‌లివ‌చ్చే వ‌ర‌కూ మ‌రికొద్ది రోజులు ఉల్లి కొర‌త వెంటాడుతుంద‌ని రైతులు, హోల్‌సేల్ వ్యాపారులు పేర్కొంటున్నారు.రెండు నెల‌ల పాటు ఉల్లి ధ‌ర‌లు భ‌గ్గుమ‌నే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఉల్లి ధ‌ర‌లు నిల‌క‌డ‌గా ఉండేలా చూసేందుకు వినియోగ‌దారుల‌ వ్య‌వ‌హారాల శాఖ ఉల్లి ఎగుమ‌తులు, ధ‌ర‌లను నిశితంగా ప‌రిశీలిస్తోంది. మ‌రోవైపు ఉల్లికి పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మండి సేల్స్ ద్వారా మిగులు నిల్వ‌ల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందుకు వినియోగదారుల వ్య‌వ‌హారాల శాఖ స‌న్నాహాలు చేస్తోంది. ఉల్లి ధ‌ర‌లను నియంత్రించి వినియోగ‌దారుల ప్ర‌యోజనాలు కాపాడేందుకు నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్ సైతం ఉల్లి సేక‌ర‌ణ‌కు క‌స‌ర‌త్తు సాగిస్తున్నాయి.

నానో కేసులో టాటా విజయం

దేశంలోని పురాతన వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ పశ్చిమ బెంగాల్‌లో భారీ విజయం సాధించింది. అక్కడ జరుగుతున్న పాత సింగూరు భూవివాదంలో టాటా పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు మమతా బెనర్జీ ప్రభుత్వం గ్రూప్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్‌కు రూ.766 కోట్లు ఇవ్వనుంది. పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో టాటా మోటార్స్‌కు చెందిన నానో ప్లాంట్‌కు మమతా బెనర్జీ గత వామపక్ష ప్రభుత్వం అనుమతి ఇవ్వడం గమనార్హం. ఈ అనుమతి ప్రకారం రతన్ టాటా కలల ప్రాజెక్ట్ నానో ఉత్పత్తి కోసం బెంగాల్‌లోని ఈ భూమిలో ఫ్యాక్టరీని స్థాపించాల్సి ఉంది. అప్పుడు మమతా బెనర్జీ ప్రతిపక్షంలో ఉన్నారు. వామపక్ష ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారు. దీని తరువాత మమతా బెనర్జీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ఆమె అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమె టాటా గ్రూప్‌కు పెద్ద దెబ్బ వేసింది.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ 13 వేల మంది రైతులకు సుమారు 1000 ఎకరాల సింగూరు భూమిని తిరిగి ఇచ్చేలా చట్టం చేయాలని నిర్ణయించుకుంది. టాటా మోటార్స్ తన నానో ప్లాంట్‌ను నెలకొల్పడానికి సేకరించిన భూమి ఇదే. ఈ మొత్తం సంఘటన తర్వాత టాటా మోటార్స్ తన నానో ప్లాంట్‌ను పశ్చిమ బెంగాల్ నుండి గుజరాత్‌కు మార్చవలసి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని పరిశ్రమలు, వాణిజ్యం, ఎంటర్‌ప్రైజ్ డిపార్ట్‌మెంట్ ప్రధాన నోడల్ ఏజెన్సీ అయిన WBIDC నుండి ఈ ప్రాజెక్ట్ కింద చేసిన మూలధన పెట్టుబడి నష్టానికి పరిహారం కోసం టాటా మోటార్స్ క్లెయిమ్‌ను సమర్పించింది. సోమవారం ఈ విషయంలో టాటా మోటార్స్ భారీ విజయం సాధించింది. ఈ నిర్ణయం గురించి సమాచారం ఇస్తూ, టాటా మోటార్స్ తరపున ముగ్గురు సభ్యుల ట్రిబ్యునల్ తన నిర్ణయాన్ని టాటా మోటార్స్ లిమిటెడ్‌కు అనుకూలంగా ఇచ్చిందని తెలిపింది.ఈ కేసులో, టాటా మోటార్స్ ఇప్పుడు మమతా బెనర్జీ ప్రభుత్వంలో ప్రతివాది పశ్చిమ బెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుండి రూ. 765.78 కోట్ల మొత్తాన్ని రికవరీ చేయడానికి అర్హుత సాధించింది. ఇది 1 సెప్టెంబర్ 2016 నాటి నుంచి WBIDC నుండి వాస్తవ రికవరీ వరకు సంవత్సరానికి 11శాతం వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. రతన్ టాటా ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను టాటా గ్రూప్ 18 మే 2006న ప్రకటించింది. అప్పట్లో రతన్‌ టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. కొన్ని నెలల తర్వాత ప్లాంట్ ఏర్పాటు కోసం టాటా గ్రూప్ సేకరించిన భూమిపై దుమారం మొదలైంది. మే 2006లో టాటా గ్రూప్ బలవంతంగా భూమిని సేకరించిందని ఆరోపిస్తూ రైతులు భారీ నిరసన చేపట్టారు. ఈ ప్రదర్శనలో రైతులతో పాటు మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ విషయంపై తన నిరసనను తెలియజేస్తూ మమతా బెనర్జీ కూడా ఆ సమయంలో నిరాహార దీక్షకు దిగారు.టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, స్థానిక రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత కారణంగా అక్టోబర్ 3, 2008న అప్పటి టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా కోల్‌కతాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సింగూర్ నుండి నానో ప్రాజెక్ట్‌ను ఉపసంహరించుకోవాలని ప్రకటించారు. అయితే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నానో ప్రాజెక్టును మార్చడానికి రతన్ టాటా ప్రత్యక్షంగా కారణమని ఆరోపించారు. దీని తర్వాత నానో ఫ్యాక్టరీని గుజరాత్‌లోని సనంద్‌కు మార్చారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z