రుషికొండపై నిర్మాణాల విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రుషికొండపై అనుమతికి మించి నిర్మాణాలు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం నియమించిన కమిటీ నివేదించింది. అనుమతికి మించి కట్టడాలు ఉన్నాయని కమిటీ తన నివేదికలో పేర్కొంది. నివేదికపై మరోసారి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి విచారణ చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రుషికొండపై నిర్మించిన కట్టడాలను మరోసారి పరిశీలించి చర్యలు తీసుకోవాలని, దీనిపై 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని అటవీ పర్యావరణశాఖను ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు నవంబరు 28కి వాయిదా వేసింది.
👉 – Please join our whatsapp channel here –