మేషం
ఒక వ్యవహారంలో పెద్దల సహకారం అందుతుంది. ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.
వృషభం
శుభ సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
మిథునం
మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి, మంచి జరుగుతుంది.
కర్కాటకం
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతా నామస్మరణ శుభప్రదం.
సింహం
మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరచిత్తంతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది. విష్ణు నామస్మరణ ఉత్తమం.
కన్య
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. మీ శారీరక శ్రమ పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించకుండా తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరించే సమస్యలు తప్పవు. దుర్గాదేవి ఆరాధన శుభకరం.
తుల
ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీలలితా సహస్రనామ పారాయణ శుభప్రదం.
వృశ్చికం
ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్నిపెంచుతుంది. బంధు,మిత్రులను ఆదరిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి. శ్రీలక్ష్మీ అష్టోత్తర పారాయణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
ధనుస్సు
చేసిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది.
మకరం
కార్యసిద్ధి ఉంది. భోజన సౌఖ్యం కలదు. బుద్ధిబలంతో తోటివారి మనస్సును గెలుస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
కుంభం
మీ శ్రమ ఫలిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తున్నాయి. కలహాలు సూచితం. తోటివారిని కలుపుకొనిపోవడం ఉత్తమం. శ్రీగణేశ అష్టోత్తర శతనామావళి చదివితే సమస్యలు తొలగుతాయి.
మీనం
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శ్రేయోదాయకం.