తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అమరావతి నుంచి దిల్లీ బయల్దేరి వెళ్లారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయనపై ఏపీ ప్రభుత్వం వరుసగా కేసులు నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో దిల్లీ వెళ్లిన లోకేశ్.. అక్కడ న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. కేసుల విషయంలో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారితో ఆయన చర్చించనున్నారు.
👉 – Please join our whatsapp channel here –