ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తనపై కస్టోడియల్ హింసకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనను హింసించిన వారిలో ఇద్దరు ఐపీఎస్లు ఉన్నారని వివరించారు. పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు హింసించారని తెలిపారు. వారిపై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని ప్రధానికి రాసిన లేఖలో రఘురామ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ సీఐడీ గతంలో రఘురామను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసు కస్టడీలో తనను హింసించినట్లు అప్పట్లోనే ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానికి రఘురామ లేఖ రాశారు.
👉 – Please join our whatsapp channel here –