ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచస్థాయికి ఎదిగిన టాలీవుడ్ అగ్రనటుడు రామ్ చరణ్ ఖాతాలో మరో ఘనత చేరింది. ఆస్కార్ అకాడమీ విడుదల చేసిన నటుల జాబితాలో చెర్రీకి చోటు లభించింది. దీంతో ఆయన అభిమానులు సంతోషంలో మునిగిపోతూ ఎక్స్‌లో రియాక్టవుతున్నారు. నటనలో అంకితభావం, ప్రామాణికతతో ఈ నటులు మన హృదయాలపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్న అకాడమీ.. నటనలో వారి నైపుణ్యం సాధారణ క్షణాలను అసాధార అనుభవంగా మారుస్తుందని ప్రశంసించింది. అకాడమీలోకి మరికొందరు నటులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు పేర్కొంది.అకాడమీ విడుదల చేసిన జాబితాలో లషన లించ్, రామ్ చరణ్, విక్కీ క్రీప్స్, లూయిస్ కో టిన్ లోక్, కేకే పామెర్, చాంగ్ చెన్, సకురా అండో, రాబర్ట్ డావి ఉన్నారు. అకాడమీ బ్రాంచ్‌లోకి వీరిని ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. కాగా, ఆస్కార్ ఇది వరకే ప్రకటించిన మెంబర్స్ ఆఫ్ క్లాస్ జాబితాలో ఎన్టీఆర్ ఇప్పటికే చోటు దక్కించుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –