రక్తహీనత దరిచేరకుండా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే శరీరంలో తగినంత ఐరన్ లెవెల్స్ (Iron Levels) ఉండాలి. హిమోగ్లోబిన్ సరిపడా ఉంటూ శరీరమంతా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లేందుకు ఐరన్ అత్యంత కీలకం. అయితే ఐరన్ లోపం మహిళల్లో అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శాకాహారం తీసుకునే మహిళలు ఐరన్‌తో కూడిన ఆహారం తీసుకోవడంపై అధికంగా దృష్టి సారించాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దైనందిన ఆహారంలో చిన్నపాటి మార్పుల ద్వారా ఐరన్ లెవెల్స్‌ను పెంచుకోవచ్చు.
లీన్‌మీట్స్, పౌల్ట్రీ, సీఫుడ్, బీన్స్, పప్పు ధాన్యాలు, పాలకూల, బ్రకోలి, ఫోర్టిపైడ్ సిరిల్స్, బ్రెడ్ వంటి ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. విటమిన్ సీ అధికంగా ఉన్న ఆహారం ఎంచుకోవాలి. శరీరం ఐరన్‌ను సంగ్రహించడాన్ని నిరోధించే టీ, కాఫీ, క్యాల్షియంతో కూడిన ఆహారాలను దూరం చేయాలి. ఐరన్‌తో కూడిన ఆహారం తీసుకున్న వెంటనే వీటిని తీసుకోవడం తగదు.
క్యాస్ట్ ఐరన్ వంట పాత్రలతో వండిన ఆహారంతో ఐరన్ సంగ్రహించే శక్తి పెరుగుతుంది. వైద్యుల సూచనలకు అనుగుణంగా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం మెరుగైన ఫలితాలను అందిస్తుంది. విటమిన్ బీ12తో కూడిన ఆహారం కూడా శరీరం ఐరన్ సంగ్రహించే శక్తిని పెంచుతుంది. ప్రేవుల ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. ఐరన్ లెవెల్స్‌ను తరచూ చెక్ చేయించుకోవాలి.
👉 – Please join our whatsapp channel here –