DailyDose

IASల మెడకు స్కిల్ డెవలప్మెంట్ ఉచ్చు

ఐఏఎస్‌ల మీదకు స్కిల్ డెవలప్మెంట్ ఉచ్చు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. మొత్తం 12 మంది ఐఏఎస్‌లను విచారించాలంటూ న్యాయవాది ప్రసాద్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారు. తెదేపా హయాంలో సీమెన్స్‌ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లోని అధికారుల్ని విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఆయన ఫిర్యాదులో కోరారు. అజయ్‌కల్లం రెడ్డి, అజయ్‌ జైన్‌, రావత్‌, రవిచంద్ర, ఉదయలక్ష్మి, ప్రేమ్‌ చంద్రారెడ్డి, సిసోదియా, కేవీ సత్యనారాయణ, శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, కృతిక శుక్ల, అర్జున్‌ శ్రీకాంత్‌, జయలక్ష్మిలను విచారించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుత స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి, అప్పటి సీఎండీ బంగారు రాజులతో పాటు కార్పొరేషన్‌లోని సీఎఫ్‌వో, సీఈవో, ఈడీని విచారించాలని కోరారు. కాంట్రాక్ట్‌, చెక్‌పవర్‌తో సంబంధం ఉన్న వివిధ స్థాయిల్లోని అధికారులను కూడా విచారించాలని సీఐడీకి ఫిర్యాదు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z