“రాజకీయంగా కేసీఆర్ ను కొట్టాలంటే మరో కేసీఆరే పుట్టాలి. బీఆర్ఎస్ ను ఓడించడం ఎవరి తరం కాదు.” అంటూ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. సీఎం కేసీఆర్ కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ షకీల్ అహ్మద్ ఆధ్వర్యంలో బోధన్ లో జరిగిన మహా యువ గర్జన సభలో భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన యువతకు ధన్యవాదాలు చెప్పారు కవిత.బీఆర్ఎస్ పార్టీ పక్షాన యువగళం ఉందని చెప్పడానికి ఈ సభనే రుజువు. గులాబీ జెండా యువతకు అండ. అన్నారు కవిత. కాంగ్రెస్ పాలనలో అలా ఉంటే గత పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో 2.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకుంటే నోటిఫికేషన్లు జారీ చేశామని, అందులో 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామని స్పష్టం చేశారు. మరో 40వేల ఉద్యోగాల భర్తీ ఆయా దశల్లో ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయగానే, పరీక్షలు పెట్టగానే, ఫలితాలు వెల్లడించగానే కాంగ్రెస్ నాయకులకు కోర్టుల్లో కేసులు వేయడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు, యువతకు కలిగే ప్రయోజనాలను దొంగదారిలో అడ్డదారిలో ఆపాలని ప్రయత్నం చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ మంచి చేయడం లేదని ధ్వజమెత్తారు.
👉 – Please join our whatsapp channel here –