Business

శంషాబాద్​ ఎయిర్​పోర్టులో ప్రారంభమైన కొత్త టెర్మినల్

శంషాబాద్​ ఎయిర్​పోర్టులో ప్రారంభమైన కొత్త టెర్మినల్

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మూడో దశ విస్తరణలో భాగంగా తూర్పు భాగంలో 2.17 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపట్టిన టెర్మినల్‌ భవనం నుంచి శుక్రవారం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నూతన టెర్మినల్‌ నుంచి పుణెకు బయలుదేరిన తొలి విమాన ప్రయాణికులతో కలిసి ఎయిర్‌పోర్ట్‌ అధికారులు శుక్రవారం రిబ్బన్‌ కత్తిరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డిపాచర్‌ గేట్స్‌(12), ఏరో బ్రిడ్జెస్‌(12), రిమోట్‌ బస్‌ డొమెస్టిక్‌ డిపాచర్‌ గేట్స్‌(24), కాంటాక్ట్‌ స్టాండ్స్‌ యంత్రాలు అదనంగా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం, మెరుగైన సేవలందించడమే లక్ష్యమని జీహెచ్‌ఐఏఎల్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z