మేడిగడ్డ బ్యారేజీని బీజేపీ ప్రతినిధుల బృందం శనివారం పరిశీలించింది. కిషన్ రెడ్డి నేతత్వంలో మేడి గడ్డ బ్యారేజీని బీజేపీ నేతలు పరిశీలించారు. కుంగిన పిల్లర్లను డా. లక్ష్మణ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరాన్ని పరిశీలించిందన్నారు. కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను కేంద్రానికి ఇచ్చిందన్నారు.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో కీలక అంశాలను పొందుపర్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పన్నులతో కాళేశ్వరం నిర్మాణం చేసిందన్నారు. కాళేశ్వరం నిర్మాణానికి రూ.40వేల కోట్లు అంచనా వేశారన్నారు. అంచనాను రూ. 1.30 లక్షల కోట్లకు పెంచారన్నారు. కాళేశ్వరంపై తెలంగాణ సమాజం అంతా ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఇంజనీర్ల నోరు మూయించి కేసీఆరే ఇంజనీర్ గా వ్యవహరించారన్నారు. కేసీఆర్ ఉత్తరం రాస్తే 15 నిమిషాల్లో సీబీఐ విచారణ చేస్తుందన్నారు.
👉 – Please join our whatsapp channel here –