ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ పర్యటలనలో భాగంగా మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు . ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరుతో 2022 కరోనా టైమ్ లో కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.ఈ పథకంలో భాగంగా ఒక వ్యక్తికి ఉచితంగా ఐదు కిలోల బియ్యా్న్ని ఉచితంగా పంపిణీ చేస్తుంది. తాజాగా మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై రూ. 2 లక్షల కోట్ల భారం పడనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతులతో పాటు పలు వర్గాలకు ఎన్నికల హామీల్ని ఇస్తూ, పలు పథకాలు ప్రకటిస్తున్న ప్రధాని మోడీ ఇదే క్రమంలో ఉచిత రేషన్ పథకం కొనసాగింపును కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది.
👉 – Please join our whatsapp channel here –