తిరుమల శ్రీవారిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. అంతకుముందు వెంకయ్య నాయుడు దంపతులకు తితిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వెంకయ్య నాయుడు దంపతులకు పండితులు వేదాశీర్వచనాలు ఇచ్చారు. ఈవో ధర్మారెడ్డి శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు వెంకయ్య నాయుడు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. అనంతరం వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆశీస్సులతో దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రపంచంలో అతి శక్తిమంతమైన దేశంగా భారత్ ఎదగాలని ఆకాంక్షించారు.
👉 – Please join our whatsapp channel here –