Politics

ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు

ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి వైద్యులు ఈరోజు మరోసారి ఆయనకు పలు వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. అంతేకాదు చర్మ సంబంధిత సమస్యలకు చికిత్స చేయనున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు ఏఐజీలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు జరిగాయి. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు. రేపు ఆయన కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరగనుంది. వైద్య చికిత్సల కోసం చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z