Politics

ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు

ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు

విజయవాడ బస్టాండ్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం బాధాకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఈ ఘటనపై ఆయన దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్లాట్‌ఫాంపైకి బస్సు దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందన్నారు. దీనికి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాలం చెల్లిన బస్సుల కారణంగానే రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదని లోకేశ్‌ ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్లుగా ఆర్టీసీ గ్యారేజీల్లో నట్లు, బోల్టుల కొనుగోలుకు కూడా ప్రభుత్వం నిధులివ్వడంలేదని విమర్శించారు. రిక్రూట్‌మెంట్‌ కూడా లేకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని లోకేశ్‌ కోరారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z