Movies

ఈ వారం థియేటర్ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు

ఈ వారం థియేటర్ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఈ చిత్రాలకు పోటీనిచ్చేందుకు ఇప్పటివరకు భారీ బడ్జెట్ పెద్ద సినిమాలు లేకపోవడంతో.. ఇప్పుడంతా చిన్న చిత్రాలదే హవా నడుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మ్యాడ్, కీడా కోలా, మా ఊరి పొలిమేర 2 చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కేవలం థియేటర్లలోనే కాదు.. ఓటీటీల్లోనూ చిన్న సినిమాలకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడు దీపావళి కానుకగా థియేటర్లలో డబ్బింగ్ సినిమాలే ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. నవంబర్ రెండో వారంలో తెలుగులో చిన్న సినిమాలు రిలీజ్ కాబోతుండడంగా.. డబ్బింగ్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక అటు ఓటీటీల్లోనూ ప్రేక్షకులను అలరించేందుకు కొన్ని సినిమాలు రెడీ అయినట్లు తెలుస్తోంది. దీపావళీ కానుకగా జపాన్, జిగర్తాండ, టైగర్ 3 వంటి చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. మరో ఇప్పుడు దీపావళీ కానుకగా రాబోతున్న సినిమాలపై ఓ లుక్కేద్దామా.

థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు..

* జపాన్.. (నటీనటులు: కార్తీ, అను ఇమ్మాన్యుయేల్).. నవంబర్ 10న రిలీజ్..

* జిగర్తాండ.. (నటీనటులు: రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య ).. నవంబర్ 10న రిలీజ్..

* అలా నిన్ను చేరి. (నటీనటులు: హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, దినేశ్ తేజ్ ) నవంబర్ 10న రిలీజ్..

* ది మార్వెల్స్.. (నటీనటులు: హాలీవుడ్ నటి బ్రీ లార్సన్).. నవంబర్ 10న రిలీజ్..

* దీపావళి.. (నటీనటులు: రాము, వెంకట్, దీపన్).. నవంబర్ 11న రిలీజ్..

* టైగర్ 3.. (నటీనటులు: సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ ).. నవంబర్ 12న రిలీజ్..

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు..

* అమెజాన్ ప్రైమ్..

* బీటీస్.. ఎట్ టూ కమ్.. కొరియన్ మూవీ.. నవంబర్ 9.

* పిప్పా.. హిందీ సినిమా.. నవంబర్ 10.

* రెయిన్ బో రిస్టా.. ఇంగ్లీష్.. నవంబర్ 7

నెట్‏ఫ్లిక్స్..

* రాబీ విలియమ్స్.. వెబ్ సిరీస్.. నవంబర్ 8

* ది కిల్లర్.. హాలీవుడ్.. నవంబర్ 10న

* ఇరుగుపట్రు.. తమిళం.. నవంబర్ 6

* ఎస్కేపింగ్ ట్విన్ ఫ్లేమ్స్.. వెబ్ సిరీస్.. నవంబర్ 8

ఆహా..

* ది రోడు.. తమిళం.. నవంబర్ 10

బుక్ మై షో..

* ది రాత్ ఆఫ్ బెక్కీ.. హాలీవుడ్.. నవంబర్ 7

* యు రార్ట్ మై ఫీలింగ్స్.. హాలీవుడ్.. నవంబర్ 7

* ది అడల్ట్స్.. హాలీవుడ్.. నవంబర్ 10

జీ5..

* ఘూమర్.. హిందీ.. నవంబర్ 10

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

* ది శాంటాక్లాజ్.. వెబ్ సిరీస్ 2.. నవంబర్ 8

* విజిలాంటి .. కొరియన్.. నవంబర్ 8

* లేబుల్.. తెలుగు.. నవంబర్ 10

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z