తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 12 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 344 మంది టికెట్ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారని తెలిపారు. అన్ని వర్గాలకు తన పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. మంగళవారం రెండో జాబితా విడుదల చేస్తామని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేయనున్నట్లు కేఏ పాల్ వెల్లడించారు.
బరిలోకి దిగుతున్న అభ్యర్థులు వీళ్లే..
* చెన్నూరు – మొయ్య రాంబాబు
* జుక్కల్ (ఎస్సీ) – కర్రోల్ల మోహన్
* రామగుండం- బంగారు కనకరాజు
* వేములవాడ- అజ్మీరా రమేశ్‌బాబు
*నర్సాపురం – సిరిపురం బాబు
* జహీరాబాద్ – బేగరి దశరథ్
* గజ్వేల్ – పాండు
* ఉప్పల్ – కందూరు అనిల్ కుమార్
* యాకుత్పురా – సిల్లివేరు నరేశ్
* కల్వకుర్తి – కట్టా జంగయ్య
* నకిరేకల్ – కదిర కిరణ్‌కుమార్
* మధిర – కొప్పుల శ్రీనివాస్ రావు
👉 – Please join our whatsapp channel here –