Devotional

ఏపీలో దీపావళి సెలవు తేదీలో స్వల్ప మార్పు

ఏపీలో దీపావళి సెలవు తేదీలో స్వల్ప  మార్పు

ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి పండుగ సెలవును ఈ నెల 13వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 13న సాధారణ సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కేఎస్‌ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం ఈ నెల 12న (ఆదివారం) దీపావళి సెలవుగా ఉంది. ఈ క్రమంలో సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలవుల జాబితాలో స్వల్ప మార్పులు చేశారు. నవంబర్‌ 13వ తేదీన (సోమవారం) ఆప్షనల్ హాలిడే బదులుగా సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z