Politics

కేంద్ర ఎన్నికల సంఘానికి తుమ్మల లేఖ

కేంద్ర ఎన్నికల సంఘానికి తుమ్మల లేఖ

దొంగ ఓట్ల నమోదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) కోరారు. ఖమ్మం జిల్లాలో ఇంటి నంబర్లు లేకుండానే ఓట్లు నమోదు చేశారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఖమ్మం నియోజకవర్గాల వారీగా నమోదు చేసిన దొంగ ఓట్ల వివరాలతో కూడిన లేఖను తుమ్మల ఈసీకి అందించారు.

ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 30 వేలకు పైగా ఓట్లను ఇంటి నంబర్లు లేకుండానే నమోదు చేసినట్లు చెప్పారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌, సీఈవో ఇతర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ మేరకు గతంలో చేసిన 9 ఫిర్యాదుల వివరాలను కూడా ఈసీకి పంపిన లేఖకు తుమ్మల జత చేశారు. ఓట్ల జాబితా తుది ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో దొంగ ఓట్లపై దృష్టి సారించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఇంటి నంబర్లు లేకుండా నమోదు చేసిన ఓట్లను వెంటనే తొలగించి.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. జాబితా నుంచి దొంగ ఓట్లను తొలగించిన తర్వాతే తుది ప్రకటన విడుదల చేయాలని ఈసీని తుమ్మల కోరారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z