Politics

విజయశాంతికి బీజేపీ పార్టీ శుభవార్త

విజయశాంతికి బీజేపీ పార్టీ శుభవార్త

విజయశాంతికి బీజేపీ పార్టీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. బిజెపి ప్రచార జాబితాలో సీనియర్ నాయకురాలు, నటి విజయశాంతి పేరును చేర్చారు. ఆమెతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు చోటు కల్పించారు. 40 మందితో కూడిన ప్రచార కమిటీ జాబితా విడుదలైంది. అందులో విజయశాంతి పేరు లేదు. ఈ విషయం హైకమాండ్ దృష్టికి వెళ్ళింది. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం తాజాగా ఆమె పేరును జాబితాలో చేర్చారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారానికి నిన్న 40మంది స్టార్ క్యాంపెయినర్స్ ప్రకటించారు. ఈ లిస్ట్‌లో ప్రధాని మోడీ, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ సహా జాతీయ నేతలు ఉన్నారు. అలాగే ఈ లిస్ట్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌, రాజసింగ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఎంపీ అర్వింద్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణలో ప్రచారానికి యోగి ఆదిత్య నాథ్, యడియూరప్ప కూడా రానున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z