Politics

చంద్రబాబు కంటికి ఆపరేషన్ పూర్తి

చంద్రబాబు కంటికి ఆపరేషన్ పూర్తి

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తైంది. గత కొన్ని రోజులుగా కుడికంటి సమస్యలతో చంద్రబాబు నాయుడు బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు నాయుడు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వైద్యులు మంగళవారం కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం చంద్రబాబు నాయుడు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఎల్వీ ప్రసాద్ వైద్యులు చంద్రబాబు కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించారు. 45 నిమిషాల్లో కాటరాక్ట్ ఆపరేషన్‌ను వైద్యులు పూర్తి చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడుని డిశ్చార్స్ చేయనున్నట్లు తెలిపారు. కాసేపు అబ్జర్వేషన్ అనంతరం చంద్రబాబు నాయుడును జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చంద్రబాబు నాయుడును తరలించనున్నారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అవ్వడంతో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z