తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2018 ఎన్నికల్లో పరిమితికి మించి గంగుల కమలాకర్ ఎన్నికల ఖర్చు చేశారంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. మరోవైపు గంగుల ఎన్నికను రద్దు చేయాలంటూ భాజపా ఎంపీ బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది.
👉 – Please join our whatsapp channel here –