Politics

జగన్‌కు టీడీపీ బహిరంగ లేఖ

జగన్‌కు టీడీపీ బహిరంగ లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది.. ఇప్పుడు కేసుల వ్యవహారం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా నడుస్తుండగా.. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు టీడీపీ నేతలు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు తెలుగుదేశం పార్టీ నేతలు.. 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ సీఎం జగన్‌కు కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, షరీఫ్, సంధ్యారాణి లేఖ రాశారు..

ఇక, టీడీపీ నేతలు రాసిన లేఖ విషయానికి వస్తే..
* తెలుగుదేశం ప్రభుత్వం సొంత కాళ్లపై నిలబడేలా సంక్షేమ పథకాలు అమలు చేసింది. కాళ్లు విరిచి కట్టు కట్టి మహానుభావుడంటూ వైఎస్‌ జగన్ గురించి ప్రచారం చేసుకున్నారు..

* టీడీపీ రూ.3లక్షలు సబ్సిడీతో ఇన్నోవా కార్లు ఇచ్చింది. జగన్ రెడ్డి వాహన మిత్ర పేరుతో రూ.10వేలు ఇచ్చి డీజిల్, మద్యం, జరిమానాలతో లక్ష లాక్కుంటున్నారు.

* బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పారిశ్రామిక రాయితీలు నిర్వీర్యం నిజం కాదా..? రూ.1.14 లక్షల కోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించడం వాస్తవం కాదా?

* అన్న క్యాంటీన్, నిరుద్యోగ భృతి లాంటి 120 సంక్షేమ పథకాలు రద్దు నిజం కాదా?

* 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్ని కబ్జాకు కుట్రలు చేస్తుండడం వాస్తవం కాదా?

* 1.42 లక్షల బ్యాక్ లాగ్ పోస్టుల్ని దూరం చేయడం వాస్తవం కాదా?

* స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కోత పెట్టి 16,800 పదవులు దూరం నిజం కాదా?

* విద్యా పథకాలు రద్దు చేసి వారిని చదువులకు దూరం చేయడం వాస్తవం కాదా?

* కల్తీ మద్యం అమ్మకాలతో 35 వేల మంది మహిళల మాంగళ్యాలు తెంచడం వాస్తవం కాదా?

* ఛార్జీలు, ధరలు, పన్నుల పెంపుతో ఒక్కో కుటుంబంపై రూ.2.78 లక్షల భారం నిజం కాదా?

* నామినేటెడ్ పదవుల్లో ఆయా వర్గాలకు ద్రోహం చేయడం వాస్తవం కాదా?

* వందల మందిని హత్య చేసి, వేల మందిపై దాడులు, కేసులతో జైల్లో నిర్బంధించడం వాస్తవం కాదా? అంటూ ఇలా లేఖలో సీఎం వైఎస్‌ జగన్‌ను నిలదీశారు టీడీపీ నేతలు.

👉 – Please join our whatsapp channel here –