Politics

పొంగులేటి ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

పొంగులేటి ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నివాసంలో రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ‌నందగిరి హిల్స్‌లోని పొంగులేటి బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బంజారాహిల్స్ లోని రాఘవ ప్రైడ్ ఆఫీసులో, జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 17లోని నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక, నిన్న ఐటీ దాడులపై స్పందించిన పొంగులేటి బీజేపీలో చేరలేదన.. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు జైలు కెళ్లేందుకు సిద్ధమన్నారు. కాగా, ఐటీ అధికారులు గురువారం తెల్లవారు జాము నుంచి ఏకకాలంలో 30 చోట్ల దాడులు చేసిన విషయం తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z