DailyDose

నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాని మోదీ నాలుగోసారి తెలంగాణకు రానున్నారు. నేడు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ రాక సందర్భంగా సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సంగీత్ ఎక్స్ రోడ్ నుంచి బేగంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను వైఎంసీఏ వద్ద క్లాక్ టవర్ – ప్యాట్నీ – ప్యారడైజ్ – సీటీఓ – రసూల్‌పురా – బేగంపేట వైపు మళ్లించనున్నారు.

బేగంపేట నుంచి సంగీత్ క్రాస్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ సీటీఓ క్రాస్ రోడ్ వద్ద బాలమ్రాయ్ – బ్రూక్ బాండ్ – టివోలి – స్వీకర్ ఉప్కార్ – వైఎంసీఏ – సెయింట్ జాన్స్ రోటరీ – సంగీత క్రాస్ రోడ్ల వైపు మళ్లిస్తున్నారు. బోయిన్ పల్లి, తాడ్‌బండ్ నుంచి టివోలి వైపు వచ్చే ట్రాఫిక్ బ్రూక్ బాండ్ వద్ద సీటీఓ – రాణిగంజ్ – ట్యాంక్‌ బండ్ వైపు మళ్లిస్తారు. కార్ఖానా, జేబీఎస్ నుంచి ఎస్‌బీహెచ్-పాట్నీ వైపు వచ్చే ట్రాఫిక్ స్వీకర్ ఉపకార్ వద్ద వైఎంసీఏ – క్లాక్ టవర్ – ప్యాట్నీ లేదా తివోలి-బ్రూక్ బాండ్ – బాలమ్రాయ్-సీటీఓ వైపు మళ్లించనున్నారు.

ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలు ఎస్‌బీహెచ్-స్వీకర్ ఉపకార్ వైపు అనుమతించడం లేదు. క్లాక్ టవర్- వైఎంసీఏ లేదా ప్యారడైజ్- సీటీఓ వైపు మళ్లిస్తారు. ఆర్టీఏ తిరుమల గిరి, కార్ఖానా, మల్కాజ్‌గిరి, సఫిల్‌ గూడ నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్‌ ను టివోలి వద్ద స్వీకర్-ఉపాకార్, వైఎంసీఏ లేదా బ్రూక్ బాండ్, బాలమ్రాయ్, సీటీఓ వైపు మళ్లించనున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌ పోస్టు నుంచి బేగంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ ను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్ వైపు, గ్రీన్ ల్యాండ్‌ ల వద్ద రాజ్‌ భవన్ వైపు మళ్లిస్తారు. పంజాగుట్ట – గ్రీన్ లాండ్స్ – బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వైపు వెళ్లే వారు ఆ మార్గాన వెళ్ళవద్దు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z