ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గకరీణకు త్వరలోనే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దళితులకు జరుగుతోన్న అన్యాయాలను గుర్తించామని, వారి బాధలను అర్థం చేసుకుని ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని మోడీ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతోన్న మాదిగల విశ్వరూప మహాసభ వేదికగా సాక్షిగా మోడీ ఈ హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా 30 ఏళ్లుగా వన్ లైఫ్ వన్ మిషన్లా పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఈ పోరాటంలో మందకృష్ణ మాదిగ నా నాయకుడు.. నేను ఆయన అసిస్టెంట్‌ను అని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
👉 – Please join our whatsapp channel here –