సీఎం జగన్‌తో తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. పోలవరం కుడి కాలువ నుంచి నీటి మళ్లింపునకు విద్యుత్ సరఫరా చేయాలని సీఎంను వంశీ కోరారు. ఇప్పటికే సీఎంకు లేఖ రాసిన వంశీ.. తాజాగా ఆయనతో భేటీ అయ్యారు. పోలవరం కుడికాల్వ నుంచి గోదావరి జలాల్ని గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట గ్రామాలకు తరలించేందుకు సహకరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. గత నాలుగేళ్లుగా సొంత ఖర్చులతో 500 మోటార్లు ఏర్పాటు చేసి నీటిని మళ్లించానని, దీనికి అవసరమయ్యే విద్యుత్తును ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందని పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే విద్యుత్తు సరఫరా ఇచ్చేలా ఏపీఎస్పీడీసీఎల్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వంశీ కోరారు. వంశీ విజ్ఞప్తిపై జగన్ సానుకూలంగా స్పందించారు.
జగన్‌ను కలిసి ఉచిత విద్యుత్ కోరిన వంశీ
Related tags :