బయటకు వెళ్లినప్పుడల్లా ఒకటిరెండు నీళ్లసీసాలు కొనుక్కోవడం మనలో చాలామంది చేసేదే. పనైపోయిన వెంటనే వాటిని పారేయకండి. వాటితో గృహాలంకరణ వస్తువులను సులువుగా తయారు చేయొచ్చు. ఎలాగంటే… సీసాల పైభాగాలను ఒకే పద్ధతిలో కత్తిరించాలి. కాస్త మందంగా ఉండే దారాలను రకరకాల రంగుల్లో ముంచి… వాటిని సీసాల చుట్టూ అందంగా చుట్టి… అంచులు అతికించాలి. వీటికి నచ్చినట్లుగా చమ్కీలు, అద్దాల్లాంటివి అలంకరిస్తే చాలు. నాలుగైదు చొప్పున వేలాడదీసినా… పూల కుండీలా చేసుకున్నా చూడముచ్చటగా ఉంటుంది. కుదిరితే కొవ్వొత్తులు, బల్బులనూ అమర్చి చూడండి.
పాతసీసాలు పారేయకుండా అలంకరణకు వాడుకోవచ్చు
Related tags :