సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్తరకం మోసాలకు తెర తీస్తున్నారు. ఇటీవల కొందరు సైబర్ మోసగాళ్లు ఫోన్ చేసి.. మరో రెండు గంటల్లో కేంద్ర టెలికం శాఖ మీ సిమ్ కార్డ్ సర్వీసు నిలిపేస్తుందని చెబుతున్నారు. అలా జరుగొద్దంటే తాము అడిగిన వివరాలు చెప్పాలంటున్నారు. అలాంటి వారి మాటలు నమ్మిన మొబైల్ యూజర్లు తమ వ్యక్తిగత వివరాలు చెబుతున్నారు. మొబైల్ యూజర్ల వ్యక్తిగత డేటాతో సైబర్ మోసగాళ్లు పలు రకాల మోసాలు చేస్తున్నారని కేంద్ర టెలికం శాఖ (డాట్) తెలిపింది.
ఇటువంటి కాల్స్ ను నమ్మొద్దని పేర్కొంటూ మొబైల్ యూజర్లకు టెలికం శాఖ కీలక హెచ్చరికలు చేసింది. ఇటువంటి కాల్స్ వస్తే మొబైల్ ఫోన్ యూజర్లు తమ నెట్ వర్క్ ప్రొవైడర్‌ని సంప్రదించాలని సూచించింది. యూజర్ల వ్యక్తిగత డేటా తాము సేకరించబోమని, సిమ్ కార్డు సర్వీసుల విషయమై వచ్చే మోసపూరిత కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హితవు చెప్పింది.
మోసపూరిత కాల్స్‌పై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీసీఆర్పీ)కి ఫిర్యాదు చేయాలని డాట్ పేర్కొంది. ఇటువంటి మోసపూరిత కాల్స్‌ను అరి కట్టడానికి తాము దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
👉 – Please join our whatsapp channel here –