🎻🌹🙏ఈ గుడిలో రాత్రిపూట శివునికి స్త్రీ అలంకరణ చేస్తారు
గోపేశ్వర మందిర్- బృందావన్…!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿శ్రీకృష్ణుడి రాసలీలా విశేషాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన పరమ పవిత్రమైన పుణ్య స్థలంగా పేరుపొందినది ‘బృందావనం’.
🌸ఈ క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాలలో బడే కుంజ్ లోని ‘గోపేశ్వర మందిర్’ఒకటి.
🌿గోపిక స్థానంలో ఈశ్వరడు వచ్చి నాట్యం చేయడం వల్ల శ్రీకృష్ణుడు శివుడికి గోపేశ్వర అని పేరు పెట్టారు.
🌸ఈ ఆలయంలో రాత్రి వేళల్లో శివుడికి స్త్రీ రూపంలో అలంకారం చేస్తారు. అందుకు కారణంగా ఒక ఆసక్తికరమైన కథనం ఒకటి పురాణ శాస్త్రాలు తెలుపుతున్నాయి.
🌿వేల సంవత్సరాల క్రితం కృష్ణుని మనవడు అయిన వ్రజనాభ ఇక్కడ శివలింగాన్ని స్థాపించారు. ఇక్కడ ఆలయంలో శివుడిని సాయంత్రం గోపికగా అలంకరణ చేయడం వల్ల చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
🌸 శరదృతువులో పౌర్ణమి రాత్రి సుగంద, సువాసనల పరిమళాలతో యమునా నది ఒడ్డున శ్రీ కృష్ణుణుడు వేణువు వాయిస్తుండగా అక్కడ ఒక అందమైన ఆహ్లదకరమైన వాతావరణం నెలకొన్నది.
🌿ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో గోపిక నృత్యం చేస్తున్నది!
ఆ పరమశివుడు కైలాసంలో ధ్యానం చేస్తుండగా..బృందావనంలో శ్రీ కృష్ణుడి వేణు నాధం తీపి ధ్వని విని మంత్రముగ్గులై, కైలాసం వదలి బృందావన్ లో శ్రీ కృష్ణుడి రాసలీలను తిలకించడానికై వచ్చాడు.
🌸పురాణాల ప్రకారం పరమ శివుడికి శ్రీకృష్ణుడితో కలసి రాసలో పాల్గొనాలనే కోరిక కలిగింది. రాసలో ఇతర పురుషులకు ప్రవేశం లేకపోవడం వలన, శివుడు స్త్రీ వేషాన్ని ధరించి రాసకు సిద్దపడుతాడు.
🌿అలా స్త్రీ రూపంలో ఉన్న శివుడిని చూసిన రాధ అసూయపడుతుంది. రాస జోరుగా
జరుగుతున్నప్పుడు ..
🌸శివుడి మేలి ముసుగు జారిపోవడం వలన శివుడి నిజ రూపం అందరి కంట పడుతుంది.
🌿సాక్షాత్తు ఆ పరమశివుడే అక్కడికి వచ్చినందుకు అందరూ ఆనందిస్తారు. గోపిక స్థానంలో ఈశ్వరడు వచ్చి నాట్యం చేయడం వల్ల శ్రీకృష్ణుడు శివుడికి గోపేశ్వర అని పేరు పెట్టారు.
🌸 ఈ కారణం చేతనే ఇక్కడి దేవాలయంలోని శివలింగానికి రాత్రి వేళ స్త్రీ అలంకారం చేస్తారు. అందుకు నిదర్శనం అక్కడ శివలింగంపై కనిపించే చిహ్నాలు గోపిక వేలిముద్రలుగా చెబుతారు.
🌿అందుకే ఈ ఆలయాన్ని గోపిశ్వర్ మహదేవ్ టెంపుల్ గా పిలవబడుతోంది.
🌸ఉత్తర ప్రదేశ్ లోని పర్యాటక ప్రదేశాలలో ఒకటి గా ఉన్న బడేకుంజ్ లోని గోపిశ్వర్ ఆలయన్నా సందర్శించి
ఆ పరమేశ్వరుడి ఆశీస్సులను పొందుతారు.
బృందావనం ఎలా చేరుకోవాలి ?
🌿విమాన మార్గం: బృందావనంకు సుమారు 150 కి. మీ ల దూరంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని వ్రిందావన్ సందర్శించవచ్చు.
🌸రైలు మార్గం: మథుర రైల్వే స్టేషన్ పదకొండు కిలోమీటర్ల దూరంలో కలదు. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా తదితర ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి. స్టేషన్ బయట టాక్సీ లేదా ఆటో లేదా బస్సులలో బృందావనం చేరుకోవచ్చు.
🌿రోడ్డు మార్గం: ఢిల్లీ, అలహాబాద్, ఆగ్రా మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి మథుర వరకు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి…స్వస్తీ..
👉 – Please join our whatsapp channel here –