Devotional

శ్రీశైలంలో ఆ రోజుల్లో స్పర్శ దర్శనాలు రద్దు

శ్రీశైలంలో ఆ రోజుల్లో స్పర్శ దర్శనాలు రద్దు

శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో మంగళవారం నుంచి కార్తిక మాసోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు డిసెంబర్‌ 12 వరకు కొనసాగనున్నాయి. రద్దీ రోజుల్లో శ్రీ మల్లికార్జున స్వామికి భక్తులు నిర్వహించే గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు తెలిపారు.శని, ఆది, సోమవారాలతో పాటు సెలవురోజుల్లో స్పర్శ దర్శనాలను రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనాలు ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. దీనికి సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా పొందాలన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z