నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి తన సంతాపం తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎస్‌కు సూచించారు. ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
👉 – Please join our whatsapp channel here –