Politics

బీఆర్ఎస్ ఎంపీలకు నోటీసులు

బీఆర్ఎస్ ఎంపీలకు నోటీసులు

బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభ చైర్మన్ కార్యాలయం బీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, సురేష్‌రెడ్డి, దామోదర్‌రావు, రవిచంద్ర, లింగయ్య యాదవ్‌లకు ప్రివిలేజ్‌ నోటీసులు నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీలు హౌస్‌లో నిరసనలు తెలుపుతూ.. ప్లకార్డులు ప్రదర్శించడంపై బీజేపీ ఎంపీ వివేక్ ఠాకూర్ చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌కు కంప్లైంట్ చేశారు. బీజేపీ ఎంపీ ఠాకూర్‌ కంప్లైంట్‌ని పరిగణలోకి తీసుకున్న ఛైర్మన్‌.. ఈ ఫిర్యాదును విచారించాలని ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రివిలేజ్ కమిటీ.. బీఆర్ఎస్ ఎంపీలకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 28లోపు సమాధానం చెప్పాలని ఎంపీలను ఆదేశించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z