కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యే భర్త తన భార్య పుట్టిన రోజును మర్చిపోవడం, ఆమె ఆయనపై చిర్రుబుర్రులాడటం తరచూ కనిపిస్తూ ఉంటుంది. అయితే సమోవా దేశంలో మాత్రం ఇలాంటి భర్తలకు జైలు శిక్ష తప్పదు. ఈ దేశంలో అమల్లో ఉన్న చట్టం ప్రకారం, భార్య పుట్టిన రోజును మొదటిసారి మర్చిపోయే భర్తను హెచ్చరిస్తారు.రెండోసారి కూడా మర్చిపోతే ఆ భర్తకు జరిమానా లేదా గరిష్ఠంగా ఐదేండ్ల జైలు శిక్ష విధిస్తారు. ఇలాంటి భర్తలను గుర్తించేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. ఈ చట్టం గురించి మహిళలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –