వరల్డ్ కప్ 2019లో భాగంగా న్యూజిలాండ్- భారత్ మధ్య జరిగిన తొలి సెమీస్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 20 ఓవర్ల తర్వాత భారత్ ఓటమి ఖాయమనుకున్న సమయంలో జడేజా- ధోని కాంబినేషన్ భారత్ క్రికెట్ అభిమానులలో ఆశలు రేపారు. గెలుపు అంచుల వరకు వెళ్లి భారత్ చతికల పడడంతో పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ఈ మూమెంట్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా భారత్ క్రికెటర్స్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత క్రికెట్ వీరాభిమాని అయిన ప్రముఖ తమిళ నటుడు యోగిబాబు పాక్ అభిమానులకి తన ట్వీట్ ద్వారా గట్టి సమాధానమిచ్చాడు. ఇండియా ఓటమిని సెలబ్రేట్ చేసుకునే ముందు మీ ఆటగాళ్ళకి సెమీ ఫైనల్ ఎలా చేరాలో చెప్పండి. గెలుపు లేదా ఓటమి ఏదైన కావచ్చు.. మీ టీం కన్నా ఇండియా బెస్ట్ అని ట్రోలర్స్‌కి తన ట్వీట్ ద్వారా సరైన సమాధానం ఇచ్చాడు యోగి బాబు. ఆయన నటించిన ధర్మప్రహు చిత్రం కొద్ది రోజుల క్రితం విడుదల కాగా, రేపు యోగిబాబు మరో చిత్రం గుర్ఖా రిలీజ్ కానుంది.
ముందు మీరు సెమీఫైనల్స్‌కు రావడం నేర్చుకోండి
Related tags :