అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో లెక్కాపత్రం లేని నగదు స్వాధీనం గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఛైర్మన్ నితిన్ గుప్తా బుధవారం వెల్లడించారు. అక్టోబరుదాకా రూ.1,021 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదే 2021లో రూ.322 కోట్లు, 2022లో రూ.347 కోట్లే దొరికాయని వివరించారు. ఎన్నికలకు ముందు ఆదాయపు పన్ను విభాగంసహా దర్యాప్తు సంస్థలు నిఘా పెంచాయని తెలిపారు. సరైన ఆధారాలు లేని నగదు, నగలకు సంబంధించిన సమాచారం టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా తమకు అందుతోందని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారం, వెండి.. వంటి వాటి స్వాధీనం మూడింతలు పెరిగినట్లు నితిన్ గుప్తా తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –