Business

రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు షోకాజ్‌ నోటీసులు

రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు షోకాజ్‌ నోటీసులు

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 13 రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నీమ్స్‌ బోరో గ్రూప్‌, ఎక్స్‌లెన్స్‌ ప్రాపర్టీస్‌, ప్రెస్టీజ్‌ గ్రూప్‌ ప్రాజెక్ట్స్‌, సనాలీ గ్రూప్‌, అర్బన్‌ యార్డ్స్‌, హ్యాపీ డ్రీమ్‌ హోమ్స్‌, విరతా డెవలపర్స్‌, రివెండల్‌ ఫామ్స్‌, కావూరి హిల్స్‌, సెవెన్‌ హిల్స్‌, బుల్‌డాక్స్‌, సుమధుర ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ సంస్థలు రెరా రిజిస్ట్రేషన్‌ లేకుండా మార్కెటింగ్‌ చేస్తున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. రెరా అనుమతి ఉన్నప్పటికీ ఆ నంబరు లేకుండా ప్రకటనలు జారీ చేస్తున్న జేబీస్‌ నేచర్‌ వ్యాలీ, జేబీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ సంస్థలకూ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్‌ లేకుండా ఏజెంట్లుగా వ్యాపారం చేస్తున్న ముగ్గురికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వని పక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z