తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. కృష్ణాజిల్లా గొల్లపూడిలో ఉమ నివాసం వద్దకు భవానీపురం పోలీసులు ఈ తెల్లవారుజామునే చేరుకున్నారు. వైకాపా నేతల అక్రమాలను ఎండగడతామంటూ ఇవాళ తెదేపా – జనసేన నేతలు ఇబ్రహీంపట్నం బూడిద చెరువు క్షేత్రస్థాయి సందర్శనకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేశ్‌లు దోపిడీ చేస్తున్నారని ఇరుపార్టీల నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో బూడిద చెరువు వద్దకు వెళ్లకుండా దేవినేని ఉమను పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు
👉 – Please join our whatsapp channel here –