Politics

తొమ్మిదిన్నరేళ్లలో మాకు దొరికింది ఆరున్నరేళ్లు

తొమ్మిదిన్నరేళ్లలో మాకు దొరికింది ఆరున్నరేళ్లు

అతి స్వల్పకాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో నిర్వహించిన రోడ్‌ షోలో కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘తొమ్మిదిన్నరేళ్లలో మాకు దొరికింది ఆరున్నరేళ్లు. ఈ ఆరున్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసు. మర్పల్లి, బంట్వారం ప్రజలు 2014కు ముందు మీ జిల్లా ఎలా ఉండేదో ఆలోచించాలి. వికారాబాద్ జిల్లాను సాకారం చేసిన వ్యక్తి కేసీఆర్. ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య కాదు పార్టీల మధ్య జరుగుతున్నాయి.కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణను తీసుకొచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాదు రేటెంతరెడ్డిగా మారిపోయారు. రూ.50 కోట్లతో దొరికిపోయిన ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటున్నారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్‌ వాళ్లు వచ్చి వరసలు కలుపుతున్నారు. కాంగ్రెస్ వాళ్ల తియ్యటి మాటలు నమ్మొద్దు. గతంలో రూ.200 పింఛను ఇవ్వనోళ్లు ఇప్పుడు రూ.4 వేలు ఇస్తామంటే ప్రజలు నమ్ముతారా? మంచిగా పనిచేసే ప్రభుత్వానికి మూడోసారి అవకాశం ఇస్తే తప్పేంటి? ఎప్పటికైనా మనవాడే సీఎంగా ఉండాలి. మా మీద గులిగినా కారు గుర్తుపైనే ఓటు వేయండి’’ అని కేటీఆర్‌ మాట్లాడారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z